Sunday, May 19, 2024

డ్యుయ‌ల్ రోల్‌, డిఫ‌రెంట్ గెట‌ప్‌.. సెన్సేష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా అజిత్ మ‌రో మూవీ..

వినోద్ తొక‌లిసి అజిత్ చేయ‌బోతున్న మూడ‌వ చిత్రం AK61.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై ఇటీవల సోష‌ల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుంద‌ని చెబుతున్నా AK 61.. స్టైలిష్ స్టార్ హెచ్ వినోద్ దర్శకత్వంలో మునుపెన్నడూ చూడని గెటప్‌లో, పొడవాటి గడ్డంతో.. విభిన్నమైన కేశాలంకరణతో కనిపిస్తున్నాడు అజిత్… ఇందులో అజిత్ డ్యుయ‌ల్‌ గెట‌ప్ లో క‌నిపించేందుకు అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోది. AK61 బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్‌పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అధికారికంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement