Saturday, May 18, 2024

నేవీ సత్తా చాటిన కమెండోలు.. విన్యాసాలతో ఆకట్టుకున్న మిలాన్​ 2022

విశాఖలో నిర్వహించిన మిలాన్ – 2022 ముగిసింది. ఎనిమిది రోజల పాటు ప్రజలను అలరించిన నేవీ.. స్వీట్ ప్రజలకు మెమోరీస్ అందించింది. విశాఖ తీరం మిలాన్‌-2022 నౌకాదళ విన్యాసాలతో నేవీ సిబ్బంది హోరెత్తించారు. సాయంత్రం సూర్యాస్తమయం వేళలో ఆర్‌కె.బీ చ్‌ కు చేరుకున్న ప్రజలు నేవీ ప్రదర్శనలకు మంత్రముగ్ధులయ్యారు.లక్షల మంది వీక్షకుల ఆనందోత్సాహాలు, కేరింతల మధ్య సముద్ర జలాలపై నౌకలు, గగనతలంలో యుద్ధవిమానాలు, మెరైన్‌ కమాండోలు అబ్బుర పరిచే విన్యాసాలు ఇలా ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఆపరేషనల్‌ డెమా న్‌స్ట్రేషన్‌లో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధనౌకల్లోని నావికులను సురక్షితంగా తీసుకెళ్లే సన్నివేశాలు ఆహ్లాదపరిచాయి. అతివేగంగా దూసుకొచ్చే యుద్ధవిమానాలు గగనతలాన్ని ముద్దాడి అంతర్థాన మయ్యే విన్యాసాలు ఆకట్టుకున్నాయి.26 నౌకలు, ఒక జలాంతర్గామి 21 విమానాలు 11 వ మిలాన్ లో పాల్గొని దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి.

మిలాన్ ముగింపు వేడుకలు INS జలశ్వలో నిర్వహిం చారు. ఆరు విదేశీ నౌకలు వర్చువల్ మోడ్‌లో ముగింపు వేడుకకు హాజరయ్యాయి.ఈ వేడుకల్లో కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ ఎన్‌ఎం ఆర్‌ఎడిఎమ్ సంజయ్ భల్లా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement