Thursday, November 30, 2023

TS | 1.50 లక్షలు దాటిన డీఎస్సీ దరఖాస్తులు.. దరఖాస్తు గడువును 28 వరకు పొడిగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డీఎస్సీ దరఖాస్తుల గడువును అధికారులు పెంచారు. ఈనెల 21వ తేదీతో గడువు ముగియడంతో దాన్ని మరో వారం రోజుల పాటు పాఠశాల అధికారులు పొడిగించారు. ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు గడువును పెంచుతూ అధికారులు ఈమేరకు ప్రకటించారు. అయితే ఈనెల 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంచారు. ఇప్పటి వరకు డీఎస్సీ దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించిన వారు మొత్తం 1,56,449 లక్షల మంది ఉండగా, దరఖాస్తు చేసుకున్న వారు 1,50,202 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement