Monday, April 29, 2024

Football: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఫుట్‌బాల్ జట్టులో స్థానం పొందిన‌ అనూష

హైద‌రాబాద్ : మహిళా ఫుట్‌బాల్‌లో ఔత్సాహిక క్రీడాకారులకు తగిన శిక్షణ ఇస్తూనే, వారికి తగిన అవకాశాలు అందించటానికి లలిగా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, 2018లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేరిన ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అనూష మండల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఫుట్‌బాల్ జట్టులో స్థానం పొందింది. వ్యవసాయ సమాజం నుండి వచ్చిన అనూష ఇప్పుడు బెంగుళూరులో జరిగే జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్, లీగ్స్‌లో పోటీ పడనుంది.

దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా, దేశానికి, ఆమె స్వస్థలమైన ఆత్మకూర్‌కు అవార్డులను తీసుకురావాలనేది ఆమె కల. భారతదేశపు మొట్టమొదటి రెసిడెన్షియల్ ఉమెన్స్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా అనంతపురంలో లలిగా ఫౌండేషన్ లక్ష్యం, ప్రతిభావంతుల సమగ్ర అభివృద్ధికి ఒక వేదికను అందించడం. ఫుట్‌బాల్ ద్వారా అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్న సంస్థ, అనూష వంటి వ్యక్తులకు క్రీడలో శిక్షణ, విద్యాపరమైన మద్దతు, సామాజిక నైపుణ్యాలు అందిస్తుంది. అర్హత కలిగిన కోచ్‌లచే నిరంతరం శిక్షణ పొందే అనూష వంటి అభ్యర్థులు దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడతారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ శిక్షణా పద్ధతులకు తెలుసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement