Friday, May 3, 2024

2డీజీ మందును ఎవ‌రు వాడాలి? ఎలా వాడాలి?

క‌రోనా వైరస్ నివారణకు పొడి రూపంలో వచ్చిన 2డీజీ ఔషధం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌పై ఈ మందు బాగా ప‌ని చేస్తున్న‌ట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. ఈ 2డీజీ మందును ఎలా వాడాలో వివరిస్తూ డీఆర్‌డీవో ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. అయితే వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఈ మందును వాడాల‌ని స్ప‌ష్టం చేసింది.

★ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల‌కు ఇస్తున్న చికిత్స‌కు అనుబంధంగా ఈ ఔష‌ధం అత్య‌వ‌సర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది.
★ మోస్త‌రు నుంచి తీవ్ర కరోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా డాక్ట‌ర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. గ‌రిష్ఠంగా ప‌ది రోజుల పాటు దీనిని వాడొచ్చు.
★ నియంత్ర‌ణ లేని డ‌యాబెటిస్‌, తీవ్ర‌మైన‌ గుండె జ‌బ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిపై ఈ ఔష‌ధాన్ని ఇంకా పూర్తిగా ప‌రీక్షించి చూడ‌లేదు. అందువ‌ల్ల కాస్త ముందు జాగ్ర‌త్త అవ‌స‌రం.
★ ఈ 2డీజీ ఔష‌ధాన్ని గ‌ర్భిణులు, బాలింత‌లు, 18 ఏళ్ల లోపు పేషెంట్ల‌కు ఇవ్వ‌కూడ‌దు.
★ ఈ ఔషధం కావాలని భావించేవారు [email protected]కు మెయిల్ చేయవచ్చు. తద్వారా హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ 2డీజీ ఔషధాన్ని సరఫరా చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement