Thursday, April 25, 2024

రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది….18 పేజెస్ ఫస్ట్ లుక్ లో ఇది గమనించారా ?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఫస్ట్ లుక్ లో అనుపమ పరమేశ్వరన్ పెన్ పట్టుకుని కాగితంపై రాస్తూ ఉంటుంది. ఆ కాగితం నిఖిల్ కళ్ళకి గంతలు కట్టి ఉంటుంది.

అయితే అక్కడ అనుపమ ఏమని రాస్తుందో తెలుసా…!!

నా పేరు నందిని.. నాకు మొబైల్ లో అక్షరాలు టైప్ చేయడం కన్నా కాగితంపై రాయటం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై మీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది అంటూ రాసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement