Wednesday, May 1, 2024

మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ డబుల్‌

నవంబర్‌లో సగటు మొబైల్‌ డౌన్‌లోడ్‌ వేగం సెకనుకు 50.26 మెగాబైట్స్‌కు చేరుకుంది. అక్టోబర్‌ (27.13మె.బై)తో పోల్చితే దాదాపు రెట్టింపు. దీంతో సగటు డౌన్‌లోడ్‌ వేగం పరంగా భారతదేశం 40 ర్యాంకులు ఎగబాకి ప్రపంచవ్యాప్తంగా 71వ స్థానానికి చేరుకుంది. ఈ మేరకు నెట్‌వర్క్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ను విడుదల చేసింది. మధ్యస్థ మొబైల్‌ డౌన్‌లోడ్‌ వేగం పరంగా, అక్టోబర్‌లో 113వ స్థానంలో ఉన్న భారతదేశం 18.26 మె.బైట్స్‌ వేగంతో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి 105వ స్థానంలో నిలిచింది.

మరోవైపు, మధ్యస్థ స్థిర బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో, భారతదేశం దాని డౌన్‌లోడ్‌ వేగం 48.78 మె.బైట్స్‌ నుండి 49.09మె.బైట్స్‌కి పెరిగినప్పటికీ, అక్టోబర్‌లో 79వ స్థానం నుండి నవంబర్‌లో 80వ స్థానానికి పడిపోయింది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సగటు వేగంలో, భారతదేశం రెండు స్థానాలు ఎగబాకి 81కి చేరుకుంది. ఆగస్టులో విడుదల చేసిన నివేదికలో, 89 శాతం మంది భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 5జీకి అప్‌గ్రేడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement