Saturday, October 5, 2024

ఎమిరేట్స్‌ లీగ్‌పై అదానీ నజర్‌..

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ టీ20 లీగ్స్‌ ఫ్రాంచైజీపై దృష్టి సారించింది. ఐపీఎల్‌ తరహాలోనే ఎమిరేట్స్‌లో నిర్వహించనున్న టోర్నీలో ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నది. యూఏఈ టీ20 లీగ్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నది. ఎంత ఖర్చు చేసేందుకు అయినా సిద్ధంగా ఉంది. ఐపీఎల్‌ గుజరాత్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ తీవ్ర ప్రయత్నాలు చేసింది.

బీసీసీఐ నిర్దేశించిన బేస్‌ ప్రైస్‌ కంటే రెట్టింపు ధర రూ.5,100 కోట్లతో బిడ్డింగ్‌ దాఖలు చేసింది. అయినప్పటికీ.. గుజరాత్‌ ఫ్రాంచైజీని దక్కించుకోలేకపోయింది. దీనికి కారణం సీవీసీ క్యాపిటల్స్‌ అంతకంటే ఎక్కువ ధరను కోట్‌ చేయడమే. రూ.5,600 కోట్లతో బిడ్డింగ్‌ వేసి ఫ్రాంచైజీని దక్కించుకుంది. సొంత రాష్ట్రాన్ని పోగొట్టుకున్న అదానీ.. ఎమిరేట్స్‌ టీ20పై కన్నేసింది. దీని కోసం ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)తో మంతనాలు సాగిస్తున్నది. కాంట్రాక్టుకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు ఆమోద ముద్ర వేయడమే మిగిలి ఉందని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement