Saturday, May 18, 2024

ఆపరేషన్ సక్సెస్…..కొత్త నాలుక అమరిక !!

బెంగళూరులో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి సక్సెస్ సాధించారు. ఇటీవల క్యాన్సర్ కారణంగా ఓ ఆటోడ్రైవర్ నాలుక దెబ్బతింది. దీంతో ఆపరేషన్ చేయవలసి వచ్చింది. కాగా దెబ్బతిన్న నాలుకను తొలగించి దాని స్థానంలో కొత్త నాలుకను తగిలించారు. కడుపులో ఉన్న స్కిన్ సాయంతో ఆ నాలుకను తయారు చేసినట్లు వైద్యులు తెలిపారు.

10 గంటల పాటు కష్టపడి ట్రస్ట్వల్ అనే ఆసుపత్రి వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆ ఆటో డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు. త్వరలోనే అతను ఆహారం కూడా తీసుకోగలరని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement