Thursday, May 2, 2024

Diwali Offers | దీపావళి ధమాకా..! ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్..

మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ప్రారంభం కానుంది. కాగా ఈ పండుగ సందర్భంగా ధమాకా సేల్ ని ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. దీపావళి పండుగకు ముందే Flipkartలో సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అనేక బ్రాండ్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తొంది ఫ్లిప్‌కార్ట్. ఇందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ అయిన IPhone, Samsung, Nothing Phone 2తో పాటు అనేక మోడల్స్‌పై భారీ డిస్కౌంట్‌ని అందిస్తొంది ఫ్లిప్‌కార్ట్.

దీపావళి సేల్‌లో Iphone 14పై భారీ తగ్గింపుని అందిస్తొంది ఫ్లిప్‌కార్ట్. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది లాంచ్ అయ్యింది. దీని అసలు ధర రూ.61,999 వరకు ఉంది.. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని బ్యాంకు కార్డులను ఉపయోగించి రూ.49,999కే పొందొచ్చు. అయితే ఎలాంటి షరత్తులు లేకుండా ఈ ఫోన్ ధరను రూ.54,999గా బుక్ చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

అదనంగా రూ.4 వేల వరకు బ్యాంకు డిస్కౌంట్ కూడా లభించనుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. పాత ఐఫోన్‌ను మార్చుకోకపోయినా, ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరలో పొందొచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్‌తో పాటు Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్ ను రూ.31,499కే కొనుగోలు చేయొచ్చు.

- Advertisement -

ఇక, Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్… ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా Galaxy F14 5G మోడల్‌పై రూ.9,990 వరకు కొనుగోల చేయొచ్చు. Realme C51పైనా రూ.7,999 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా.. ఇదే సేల్‌లో ఇటీవల విడుదల చేసిన Motorola Edge 40 Neoపైనా భారీ తగ్గింపు లభించనుంది. రూ.25,999 వరకు ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మరోవైపు స్మార్ట్‌ఫోన్ Vivo T2 Proని రూ.21,999కి కొనొచ్చు. Poco X5 Pro కేవలం రూ.18,499కే లభించనుంది. అంతేకాదు సామ్ సంగ్ Galaxy F34 5G రూ.14,999కి అందుబాటలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement