Monday, April 29, 2024

Chandigarh Mayor: ఇండియా కూట‌మికి భంగ‌పాటు… చండీఘ‌డ్ మేయ‌ర్ ప‌ద‌వి బిజెపి కైవ‌సం

బీహార్ సీఎం నితీష్ కుమార్ విప‌క్ష ఇండియా కూట‌మిని వీడి ఎన్డీయేలో చేరిన అనంత‌రం ఇండియా కూట‌మికి తొలి ఎన్నిక‌ల్లో భంగ‌పాటు ఎదురైంది. చండీఘ‌ఢ్ మేయర్ ఎన్నిక‌ల్లో విప‌క్ష కూటమిపై బీజేపీ విజ‌యం సాధించింది. బీజేపీ అభ్య‌ర్ధి మ‌నోజ్ కుమార్ సోంక‌ర్ ఆప్‌-కాంగ్రెస్ ఉమ్మ‌డి అభ్య‌ర్ధి కుల్దీప్ సింగ్‌పై విజ‌యం సాధించారు.

ఎక్స్అఫిషియో స‌భ్యుడు కిర‌ణ్ ఖేర్ ఓటుతో స‌హా మ‌నోజ్ సోంక‌ర్‌కు 16 ఓట్లు ద‌క్కించుకున్నారు. ఇండియా కూటమికి 12 ఓట్లు వచ్చాయి.35 మంది స‌భ్యులు క‌లిగిన చండీఘ‌ఢ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో బీజేపీ 16 స్ధానాల‌ను గెలుపొందింది.. ఆప్ కూట‌మికి 20 స్థానాలున్నాయి.. సునాయ‌సంగా ఇండియా కూట‌మి గెల‌వాల్సిన మేయ‌ర్ సీటును అనూహ్యంగా ఓట‌మి పాలైంది.. ఓటింగ్ లో ఎనిమిది ఓట్ల‌ను చెల్లుబాటు కాక‌పోవ‌డం ఇండియా కూట‌మి అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది.. చెల్లుబాటు కానీ ఓట్లు అన్ని కాంగ్రెస్, అప్ వి కావ‌డం విశేషం.. కాగా, కౌంటింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్‌ను ముందుకు రానివ్వలేదని, ఈ సందర్భంగా ఆయన పెన్నుతో కొన్ని మార్కింగ్‌లు చేశారని, ఆ తర్వాత ఓట్లను రద్దు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement