Thursday, May 2, 2024

‘రామ్ గోపాల్ వ‌ర్మ’ సినిమాకి అరుదైన గౌర‌వం..

సంచ‌ల‌నాల‌కి పెట్టింది పేరు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌..రౌడీయిజం అయినా,రొమాంటిక్ అయినా, సామాజిక అంశాల‌పై అయినా ఎటువంటి సినిమాలైయినా తీయ‌డంలో ఈయ‌న స్టైలే వేరు. వివాదాల‌కు ఎదురెళ్ళ‌డం, విమ‌ర్శ‌ల పాల‌వ్వ‌డం ఈయ‌న‌కి అల‌వాటు..ఎటువంటి విష‌యానైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌టం ఇత‌ని నైజం. ఈ మ‌ధ్య‌కాలంలో వ‌ర్మ తెర‌కెక్కించే చిత్రాల‌కి అంత‌గా ఆద‌ర‌ణ ఉండ‌ట్లేద‌ని తెలిసిన సంగ‌తే. అయితే ఇప్పుడో అద్భుతం చోటు చేసుకుంది. ఇండియాలోనే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అంటూ ‘లడికి’ అనే సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వ‌ర్మ. పైగా ఈయన కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు మేకర్స్. ల‌డ్‌కీ: ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్పేరుతో ఈ సినిమా వస్తుంది.

ఈ సినిమాని FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు. బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు యానవర్శరీ సందర్బంగా ఆయన నేటివ్ ప్లేస్ అయిన చైనాలోని FOSHAN లో ఈ సెలబ్రేషన్స్ చోటు చేసుకోనున్నాయి.ఈ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. హిందీలో ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ సినిమాకు హిందీ వెర్షన్ ఇది. బ్రూస్ లీ‌కి వీరాభిమాని అయిన ఒక అమ్మాయి కథను ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో తెరపై ఆవిష్కరించారు. పూజా బాలేకర్ ఈ సినిమా ద్వారా పరిచయమవుతోంది. ఇండో – చైనీస్ కోప్రొడక్షన్ లో సినిమా రూపొందింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఓ అమ్మాయి ఏం చేసింది? ఏంటి? అనేది కథగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement