Friday, April 26, 2024

రెండేళ్ల తర్వాత వానరాలకు మళ్లీ విందు!

థాయ్ లాండ్ – పర్యాటకరంగంపై ఆధారపడిన థాయ్ లాండ్ కరోనా మహమ్మారి కారణంగా కటకటలాడిపోయింది. ప్రయాణీకులపై ఆంక్షలవల్ల పర్యాటక రంగం కుదేలైంది. ఆ దేశంలో పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే లాప్ బురి ప్రాంతం గురించి చాలామందికి తెలుసు. అక్కడ కోతులు ఎక్కువ. నిజానికి, ఆ ప్రాంతాన్ని మంకీటౌన్ అని కూడా పిలుస్తారు. ఏటా అక్కడ ఉండే కోతులకు వివిధ రకాల పళ్లతో విందు ఏర్పాటు చేస్తారు. ఆ సందర్భంగా ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

అయితే, కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ వేడుకలు నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇటీవల కోవిడ్ ఆంక్షలను సడలించి, విదేశాల నుంచి పర్యాటకులను అనుమతిస్తుండటంతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం కోతులకు పండ్ల విందు ఏర్పాటు చేశారు. వివిధ రకాల పళ్లను కుప్పలుగా పోశారు. వందలాది వానరాలు వచ్చి వాటికి నచ్చినవి తిన్నాయి. ఈ ఏడాది వేడుకను వీల్ చైర్ వేడుకగా పిలుచుకున్నారు. అంటే, ఈ వేడుక నిర్వహించిన సందర్భంగా అక్కడి యువత వీల్ చైర్లను అవసరమైన పేదలకు ఉచితంగా పంచారన్నమాట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement