Sunday, January 16, 2022

రైల్లో డిస్పోజ‌బుల్ బెడ్ రోల్ ..

రైలు ప్ర‌యాణికుల‌కు రైల్వే సంస్థ స‌రికొత్త స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర‌ప్రాంతాల‌కు వెళ్లే వారి కోసం డిస్పోజ‌బుల్ బెడ్ రోల్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్ర‌యాణికులు రూ.150 చెల్లిస్తే… డిస్పోజ‌బుల్
బ్లాంకెట్‌, పిల్లో, పిల్లో క‌వ‌ర్‌, బ్లాంకెట్‌, ఫేస్‌మాస్క్, హ్యాండ్ నాప్‌కిన్‌, శానిటైజ‌ర్ శాచెట్ అంద‌జేస్తారు. ఇవ‌న్నీ ప్యాక్‌చేసి ఓ ప్యాకెట్‌లో ప్ర‌యాణికులు అంద‌జేస్తున్నారు. ఇప్ప‌టికే వెస్ట్ర‌న్ రైల్వేలో అమ‌లులోకి వ‌చ్చింది. ముంబై- ఢిల్లీ, క్రాంతి ఎక్స్ ప్రెస్‌, గోల్డెన్ టెంపుల్ మెయిల్‌, ప‌శ్చిమ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌లో అందుబాటులో తీసుకొచ్చారు. ప్ర‌యాణికుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌ ల‌భిస్తోంద‌ని రైల్వే అధికారులు తెలిపారు. ప్ర‌యాణికులు అద‌న‌పు ల‌గేజీ భారం లేకుండా, నేరుగా రైలెక్కి రూ.150లు చెల్లిస్తే, బెడ్‌షీట్‌, బ్లాంకెట్ త‌దిత‌ర వ‌స్తువుల‌న్నీ పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News