Monday, April 29, 2024

ధనుష్ మూవీ అప్ డేట్.. కొత్త సినిమా టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్..

ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఓ ఫీచర్ ఫిల్మ్‌లో వ‌స్తున్న సంగతి తెలిసిందే.. 1930-40 కాలం నేపథ్యంలో జరిగే ఓ పీరియాడికల్ డ్రామాగా ఇది రూపొందుతోంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే.. తాజాగా దీనికి సంబంధించి ఓ అప్ డేట్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాకి కెప్టెన్ మిల్లర్ అనే పేరు పెట్టారు.. ఒక మోష‌న్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు నిర్మాత‌లు.

ఈ సినిమాకి GV ప్రకాష్ సంగీతాన్నిఅందించగా.. చిత్ర సాంకేతిక బృందంలో శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నాగూరన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో 2023లో విడుదల కానుంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement