Friday, June 21, 2024

ప్ర‌భాస్‌కి ఫిక్స్ అయిన అనుష్క‌.. నెక్ట్స్ ప్రాజెక్టుపై పెరుగుతున్న అంచ‌నాలు

అనుష్క, ప్రభాస్ జోడీకి చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. వీరిద్ద‌లు స్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండ‌గే. వారి రిలేష‌న్ గురించి అనేక పుకార్లు కూడా ఉన్నాయి. బిల్లా, మిర్చి, బాహుబలి వంటి చిత్రాలలో వీరిద్దరూ కలిసి న‌టించారు. అయితే ప్ర‌స్తుతం వెయిట్ లాస్ సమస్యలతో సతమతమవుతున్న అనుష్క.. ఇంకా రెగ్యూల‌ర్ షూటింగ్స్ లో జాయిన్ కాలేదు. తాజా స‌మాచారం ప్రకారం.. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వం వహించనున్న అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ లో.. స్వీటీని మెయిన్ లీడ్ హీరోయిన్స్ లో సెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. వచ్చే దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి ఈ ఏడాతదే షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా, మిగిలిన ఇద్దరు హీరోయిన్ల‌ను త్వరలో క‌న్ఫార్మ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ఒక కామిక్ ఎంటర్‌టైనర్గా ఉండ‌బోతుంద‌ని ప్ర‌స్తుతం రాజా డీలక్స్ అనే టైటిల్ ను సెట్ చేసిన‌ట్టు నిర్మాత‌లు ఇదివ‌ర‌కే పేర్కోన్నారు. అయితే మారుతీ స్క్రిప్ట్‌పై పని చేయడం ప్రారంభించాడు, త్వరలో ఫైనల్ డ్రాఫ్ట్‌ను ప్రభాస్‌కు వినిపించ‌నున్న‌డు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ ఆసక్తికరమైన చిత్రం 2-3 షెడ్యూల్స్‌లో పూర్తి కానుంది. మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌క్కిన‌ పక్కా కమర్షియల్ సినిమా నిన్న (శుక్ర‌వారం) విడుదల అయింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ K, సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement