Saturday, May 4, 2024

కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటికిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆల‌యం, శ్రీశైలం మల్లన్న ఆలయం, శ్రీ‌కాళ‌హ‌స్తి, కపిలతీర్తం సహా ఇతర శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అర్ధరాత్రి నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్‌, మార్కండేయ ఘాట్‌, కోటిలింగాల ఘాట్‌, గౌతిమి ఘాట్‌లలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తులు, అనంతరం పూజలు చేస్తున్నారు. స్వామి వారి ద‌ర్శ‌నానికి గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో వేచి ఉన్నారు. శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో శివుడి శైవక్షేత్రాలు మార్మోగిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement