Friday, May 3, 2024

రాయలసీమ యూనివర్సిటీ వీసీపై చర్యలకు డిమాండ్.. యూజీసీ వద్ద విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాయలసీమ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆనందరావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం తెలుగు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన విద్యార్థులు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ నినాదాలు చేశారు.

వీసీ ఆనందరావు అవినీతిని బయటపెట్టినందుకు కక్ష కట్టి తమను వేధిస్తున్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. పరీక్షలు రాయకుండా చేసి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని వారు మీడియాకు తెలిపారు. వీసీపై చర్యలు తీసుకోవలసినదిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని యూజీసీ అధికారులను డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement