Monday, April 29, 2024

Delhi | ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద నిధుల విడుదల.. జీవీఎల్ ప్రశ్నలకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద విడుదల చేసిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందా అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు మంగళవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బదులిచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటుకుగానూ రూ.10, 461 కోట్లు ఈ ఏడాది మేలో విడుదల చేసినట్టు తెలిపారు.

ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్ క్రింద రూ.10,460.87 కోట్లు విడుదల చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధుల గురించి జీవీఎల్ ప్రశ్నించగా ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.14,970.09 కోట్ల నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసినట్టు వివరించారు.

- Advertisement -

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పెద్దఎత్తున ఆర్థిక సహాయం చేసినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా నిర్వహించడం పట్ల ఎంపీ జీవీఎల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజా సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement