Thursday, May 2, 2024

దీపావ‌ళి నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ కి బ్రేక్..ఎక్క‌డో తెలుసా..

క‌రోనా నివార‌ణ నేప‌థ్యంలో అంద‌రూ వ్యాక్సినేష‌న్ బాట ప‌ట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు… వందల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ లను ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే విజయవంతంగా సాగుతున్న ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు రేపు అక్టోబ‌ర్ 4న బ్రేక్ పడనుంది. రేపు దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో వాక్సినేషన్ ప్రక్రియకు సెలవు ప్రకటించింది తెలంగాణ ఆరోగ్యశాఖ. వైద్య.. సిబ్బంది విజ్ఞప్తుల మేరకు రేపటి రోజున వ్యాక్సినేషన్ కు సెలవు ప్రకటించింది ఆరోగ్యశాఖ. ఎల్లుండి నుంచి తిరిగి యధా విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement