Monday, April 29, 2024

Fake campaign | ఎన్నికల ప్రచారంలో డీప్ ఫేక్.. కాంగ్రెస్ పై అమీర్ ఖాన్ ఫిర్యాదు

బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీకి చెందిన ఒక ప్రాచార ప్ర‌క‌ట‌న‌లో త‌న ఫోటోల‌ను వాడార‌ని… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తన డీప్ ఫేక్ వీడియోను ఫేక్ క్యాంపెయిన్ యాడ్‌ను ఉపయోగించారని అమీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని అధికార బీజేపీని అమీర్ ఖాన్ ప్రశ్నిస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తోంది.

అయితే 10 ఏళ్ల క్రితం తాను హోస్ట్ చేసిన సత్యమేవ జయతే అనే టీవీ షో ఎపిసోడ్‌ను ఏఐ డీప్ ఫేక్ వీడియో తీసి ఈ యాడ్‌లో ఉపయోగించిందని అమీర్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల సినీ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ య‌డ్ పూర్తిగా ఫేక్ వీడియో అని… ఇందులో వాస్తవం అమీర్ ఖాన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement