Sunday, May 19, 2024

ప్యాసింజర్‌ వాహనాలకు తగ్గిన డిమాండ్‌.. సెమీ కండక్టర్ల కొరతే కారణం : ఫడా అధ్యక్షుడు వింకేష్‌ ..

ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ అమ్మకాలు 2022, జనవరిలో ఇయర్‌ ఆన్‌ ఇయర్‌తో పోలిస్తే.. 10 శాతం క్షీణించాయి. సెమీ కండక్టర్ల కొరతే దీనికి కారణమని కంపెనీలు చెబుతున్నాయి. సెమీ కండకర్ల కారణంగా భారీగా ఉత్పత్తి నిలిచిపోయిందని వివరించారు. ప్యాసింజర్‌ వాహనాలు విక్రయాలు జనవరి 2021లో 2,87,424 యూనిట్ల నుంచి 10.12 శాతం తగ్గి గత నెలలో 2,58,329 యూనిట్లకు పడిపోయాడు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటో మొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫడా) అధ్యక్షుడు వింకేష్‌ గులాటీ మాట్లాడుతూ.. వాహన విక్రయాలకు మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ.. ప్యాసింజర్‌ వాహనాలు సెమీ కండక్టర్‌ కొరతను ఎదుర్కొంటూనే ఉన్నాయన్నారు. ఫలితంగా మెరుగైన పెట్టుబడులు పొందడం లేదని తెలిపారు. జనవరిలో ద్వి చక్ర వాహనాల అమ్మకాలు 13.44 శాతం క్షీణించాయి. గత నెల జనవరిలో 11,75,832 యూనిట్లతో పోలిస్తే.. గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 13.44 శాతం తగ్గి.. 10,17,785 యూనిట్లకు పడిపోయాయి.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం..

వాహన ధరల పెరుగుల, సెమీ కండక్టర్ల కొరతతో పాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా అమ్మకాలపై ప్రభావం చూపింది. ఫలితంగా గ్రామీణ కష్టాలు ఎదురయ్యాయి. దీంతో ఈ విభాగంలో అమ్మకాలు తగ్గడానికి దారి తీశాయని గులాటీ వివరించారు. అయితే వాణిజ్య వాహన విక్రయాలు గత నెలలో 56,227 యూనిట్ల నుంచి 20.52 శాతం వృద్ధితో 67,763 యూనిట్లకు చేరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పునరుద్ధరణతో.. వాణిజ్య వాహన విభాగంలో అమ్మకాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా హెవీ కమర్షియల్‌ వెహికిల్స్‌ కేటగిరిలో వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన మౌలిక సదుపాయాల వ్యయంతో.. మొత్తం కమర్షియల్‌ వాహనాల విభాగం ఊపందుకుందని తెలిపారు. త్రీ-వీలర్‌ రిటైల్‌ విక్రయాలు కూడా 29.8 శాతం పెరిగి.. 2022 జనవరిలో 40,449 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం 31,162 యూనిట్లు ఉన్నాయి.


గాడిలో పడుతున్న రిటైల్‌ సేల్స్‌..

జనవరి 2021లో 16,12,130 యూనిట్ల నుంచి 14,39,747 యూనిట్లకు గత నెలలో కేటగిరీల మొత్తం అమ్మకాలు 10.69 శాతం క్షీణించాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అమ్మకాలపై ఒత్తిడి చూపించిందని గులాటీ వివరించారు. రిటైల్‌ అమ్మకాలు మెల్లిగా గాడిలో పడుతున్నాయని తెలిపారు. సెమీ కండక్టర్ల కొరత కారణంగా.. అనుకున్న సమయానికి వాహనాలు డెలివరీ చేయలేకపోయామన్నారు. సెమీ కండక్టర్ల కొరత తీరుతున్న నేపథ్యంలో.. అమ్మకాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నట్టు గులాటీ వివరించారు. 25,000 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మించాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారని, ఇది మౌలిక సదుపాయాల వ్యయాన్ని మరింత పెంచుతుందని, దీంతో వాణిజ్య వాహనాల విక్రయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని గులాటీ ఆశాభావం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు కూడా ప్రారంభం అవుతున్నాయని, దీంతో ద్వి చక్ర వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాజా పరిస్థితులు నెగిటివ్‌ నుంచి రానున్న మరికొన్ని నెలల్లో తటస్థానికి చేరుకుంటాయని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement