Thursday, April 25, 2024

వివాదంగా మారిన జిల్లా జడ్జి మరణం.. హత్య చేశారా?

జార్ఖండ్‌లో జిల్లా జడ్జి మరణం వివాదానికి కారణమైంది. ఆయనను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధన్ బాద్‌లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళుతుండగా గుర్తుతెలియని ఒక వాహనం ఢీకొట్టింది. అయితే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఈ వాహనం కావాలనే జడ్జి ఆనంద్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదులు లేవనెత్తారు.

అయితే ఇటీవల మాఫియా, గ్యాంగ్ స్టర్ బెయిల్ పిటిషన్‌లను జడ్జి ఉత్తమ్ ఆనంద్ తిరస్కరిచండం వల్లనే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. ఆ వాహనం కూడా దొంగిలించిందిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన జడ్డి ఉత్తమ్ ఆనంద్ ను గుర్తుతెలియని వ్యక్తిగా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

ఈ వార్త కూడా చదవండి: ఆగస్టు 31 వరకు కరోనా మార్గదర్శకాలు పొడిగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement