Friday, May 3, 2024

నాని కొత్త చిత్రం ద‌స‌రా-రేపే ఫ‌స్ట్ సింగిల్

నేచుర‌ల్ స్టార్ హీరో నాని మాస్ యాక్ష‌న్ తో దుమ్మురేప‌నున్నాడు. శ్రీకాంత్ ఓదెలా తెర‌కెక్కిస్తోన్న దసరా సినిమాతో మొదటి సారిగా అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నానికు జోడీగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా దసరా ఫస్ట్‌ సింగిల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను 5భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ముందుగా ఈ చిత్రాన్ని కేవలం సౌత్‌ ఇండియాలోనే రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దక్షిణాదిన కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజా అప్‌డేట్‌తో క్లారిటీ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement