Thursday, May 2, 2024

Cyclone Biperjoy – ప్ర‌ళ‌య‌భీక‌రంగా క‌చ్ వైపు దూసుకొస్తున్న తుఫాన్ – స్పేస్ స్టేష‌న్ నుంచి ఫోటోలు..

న్యూఢిల్లీ: బిప‌ర్‌జాయ్ తుఫాన్ నేటి సాయంత్ర 4 – 5 గంట‌ల మ‌ధ్య గుజ‌రాత్ లోని క‌చ్ వ‌ద్ద తీరం దాట‌నున్న‌ది. కచ్‌ సమీపంలోని మాండ్వి-పాక్‌లోని జఖౌ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటేవేళ గంటకు 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని హెచ్చరించింది. దాంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్ప‌టికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సాయంత్రం వరకు సముద్రం కల్లోలంగా ఉండనుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తుపాను గుజరాత్‌ తీరానికి ద‌గ్గ‌ర‌గానే ఉందని అధికారులు వెల్లడించారు. ఇది స్వల్పంగా బలహీనపడినా గుజరాత్‌కు ముప్పు పొంచే ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర మీడియాకు వెల్లడించారు. ఈ తుపాను ముప్పుతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లోని సుమారు 74వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇక అరేబియా సముద్రం లో ఏర్పడిన వాటిలో ఎక్కువ కాలం కొనసాగనున్న తుపానుగా బిపోర్‌జాయ్‌ నిలవనుంది. జూన్‌ ఆరు ఇది ఏర్పడింది. తీరాన్ని తాకిన తర్వాత కూడా ఇది మరికొన్ని రోజులు ఉనికిలో ఉంటుంది. ఇక తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్‌లో అమల్లో ఉంచారు. ఆలయాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.

8 రాష్ట్రాల్లో వర్షాలు..
బిపోర్‌ జాయ్‌ తుపాను ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్‌ దీవ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. ఇక తుపాను నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తీర ప్రాంత పట్టణాలు, అరేబియా ద్వీప దేశాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే 74 వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అయితే అతి తీవ్ర తుఫాన్‌గా మారిన బిప‌ర్‌జాయ్‌ని అంత‌రిక్ష కేంద్రం నుంచి ఫోటోలు తీశాడు ఓ ఆస్ట్రోనాట్‌. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కు చెందిన వ్యోమ‌గామి సుల్తాన్ అల్ నెయిది స్పేస్ స్టేష‌న్ నుంచి ఆ ఫోటోల‌ను తీశాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌న ఆ తుఫాన్ ఫోటోల‌ను అప్‌లోడ్ చేశాడు. అంత‌కుముందు ఆయ‌న త‌న అకౌంట్‌లో బిప‌ర్‌జాయ్ వీడియోను కూడా పోస్టు చేశాడు.

స్పేస్ స్టేష‌న్ నుంచి ఫోటోలు తీసిన అస్ట్రోనాట్ …
అతి తీవ్ర తుఫాన్‌గా మారిన బిప‌ర్‌జాయ్‌ని అంత‌రిక్ష కేంద్రం నుంచి ఫోటోలు తీశాడు ఓ ఆస్ట్రోనాట్‌. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కు చెందిన వ్యోమ‌గామి సుల్తాన్ అల్ నెయిది స్పేస్ స్టేష‌న్ నుంచి ఆ ఫోటోల‌ను తీశాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌న ఆ తుఫాన్ ఫోటోల‌ను అప్‌లోడ్ చేశాడు. అంత‌కుముందు ఆయ‌న త‌న అకౌంట్‌లో బిప‌ర్‌జాయ్ వీడియోను కూడా పోస్టు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement