Tuesday, April 16, 2024

Vizag : కిడ్నాప్ క‌థ‌ సుఖాంతం.. పోలీసుల అదుపులో దుండ‌గులు

విశాఖ‌ప‌ట్నంలో కిడ్నాప్ క‌ల‌క‌లం రేగింది. ఈ ఘ‌ట‌న‌లో స్త్రకంగా ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. రిషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, ఎంపీ భార్య, కొడుకును బంధించారని సమాచారం. ఆపై వారితో ఆడిటర్ కు ఫోన్ చేయించి పిలిపించి.. ఆడిటర్ వచ్చాక ముగ్గురినీ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది.
కాగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఎంపీ భార్య జ్యోతి, కొడుకు చందు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులు కిడ్నాప్ అయ్యారని సమాచారం. రిషికొండలోని ఎంపీ ఇంట్లో నుంచి ఈ ముగ్గురినీ దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఎంపీ ఎంవీవీ, ఆడిటర్ గన్నమనేని ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దుండ‌గుల‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడిగా హేమంత్‍గా గుర్తించిన పోలీసులు – కిడ్నాప్ చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు – 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు. దాంతో కిడ్నాప్ క‌థ సుఖాంతంగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement