Friday, October 11, 2024

YCP MP: విశాఖ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్‌ కలకలం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గురువారం కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా ఎంపీ భార్య, కొడుకులనే దుండగులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. రిషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, ఎంపీ భార్య, కొడుకును బంధించారని సమాచారం. ఆపై వారితో ఆడిటర్ కు ఫోన్ చేయించి పిలిపించారని, ఆడిటర్ వచ్చాక ముగ్గురినీ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి, కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఎంపీ భార్య జ్యోతి, కొడుకు చందు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులు కిడ్నాప్ అయ్యారని సమాచారం. రిషికొండలోని ఎంపీ ఇంట్లో నుంచి ఈ ముగ్గురినీ దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఎంపీ ఎంవీవీ, ఆడిటర్ గన్నమనేని ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆయన క్షేమంగానే ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement