Friday, May 3, 2024

నిరుపేద విద్యార్థిణికి సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ చేయూత..

తొర్రూరు, (ప్రభాన్యూస్) : పట్టణంలోని 4వ వార్డు రాజీవ్ నగర్ కు చెందిన చార్ల రేణుక, సమ్మయ్య కుమార్తె చార్ల మనిషా, నిరుపేద విద్యార్థిని పదవ తరగతిలో పదికి పది పాయింట్స్ వచ్చినప్పటికి ఆర్థిక స్థోమత సరిగ్గా లేక చదువు ఆపేసింది. దీంతో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ యమునా జంపన్న పేర్ల సోమవారం సిడబ్ల్యూసి చైర్ పర్సన్ డాక్టర్ సుంకరనేని నాగవాణి దృష్టికి తీసుకురావడంతో ఆమె స్పందించి పట్టణ కేంద్రంలో ఉన్న మైనారిటీ బాలికల గురుకుల కళాశాలలో ప్రవేశం కల్పించారు.

ఈ సందర్బముగా నాగవాణి మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రతిఒక్కరం తోడ్పాటును అందించాలని, ప్రభుత్వం బాలికలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద విద్యార్థుల చదువుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలన్నారు. లింగవివక్షత లేని సమాజాన్ని నిర్మాణించాలని అన్నారు. బాలిక చదువు విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన స్థానిక కౌన్సిలర్ యమునా జంపయ్యను ప్రత్యేకంగా అబినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement