Sunday, May 5, 2024

ఆసీస్ టెస్టు కెప్టెన్ గా క‌మిన్స్..

సిడ్నీ: ఆసీస్ టెస్టు జ‌ట్టు కెప్టెన్ గా పాట్ క‌మిన్స్, వైస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. టిమ్ పైన్ స‌పోర్టింగ్ స్టాఫ్ ఒక‌రికి అస‌భ్య‌క‌ర సందేశాలు పంపిన నేప‌థ్యంలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈక్ర‌మంలో స్మిత్ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని అంతా ఊహించినా అనూహ్యంగా క‌మిన్స్ తెర‌పైకి వ‌చ్చాడు.

త్వ‌ర‌లో ఇంగ్లండ్ తో ఆసీస్ యాషెస్ సిరీస్ లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ కు క‌మిన్స్ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని క్రికెట్ ఆస్ర్టేలియా వెల్ల‌డించింది. డిసెంబ‌ర్ 8న గ‌బ్బాలో తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. కాగా క‌మిన్స్ ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్సుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి విదిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement