Monday, April 29, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 30 గంటల స‌మ‌యం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవ్వాల (ఆదివారం) సెలవు కావడంతో పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.. టోకెన్లు లేని వారికి దర్శనానికి 30 గంటల సమయం ప‌డుతోంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, తిరుమలకు 75,510 మంది భక్తులు రాగా, 36,272 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో ఆలయానికి హుండీ ద్వారా రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.

కొవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. కాగా, శనివారం నుంచి తిరుమల అలిపిరి కాలిబాటపై దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి కాలిబాటలోని గాలిగోపురం వద్ద 10,000 టోకెన్లు, శ్రీవారి మెట్లు మార్గంలోని 1250వ మెట్టు వద్ద 5,000 టోకెన్లు. భక్తులు నేరుగా ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. దివ్యదర్శనం టోకెన్ల జారీని కొద్దిరోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement