Friday, May 3, 2024

సినీ పరిశ్రమకు షాక్ ఇస్తున్న లోకేష్.. 120 రోజుల్లోనే మూవీ ఫినిష్‌!

కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న సినిమాల నిర్మాణ సమయాలు, ఖర్చులతో.. నేటి నిర్మాన రంగంతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగాయి అనే చెప్పవచ్చు. పాన్-ఇండియా సినిమాలతో నిర్మాణానికి పట్టే సమయం మరింత పెరిగింది. ఇప్పుడు ప్రతి సినిమాకి హీరో, డైరెక్టర్లు ఒక సంవత్సరం సమయం తీసుకుంటున్నారు. పాన్ ఇండియా లేదా పెద్ద సినిమా అయితే ఏకంగా 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు. అయితే, మరోవైపు లోకేష్ కనగరాజ్ అనే యువ దర్శకుడు తన సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఆయన సినిమాలన్నీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక మాఫియా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసిన‌ లోకేష్.. విజయ్-67 పాన్-ఇండియా మూవీ అయిన లియో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇది చాలా మంది పరిశ్రమలోని వ్యక్తులను షాక్‌కు గురి చేసింది. టోటల్ షూటింగ్ పార్ట్ 120 రోజుల్లో పూర్తవుతుందని, ఇప్పటికే 60 రోజుల షూటింగ్ పూర్తి చేశామని దర్శకుడు ప్రకటించి చాలా మందిని ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం 60 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా జూన్ నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయనుంది. లోకేష్ కనగరాజ్ ప్లానింగ్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ నిజంగా ఆకట్టుకుంటుంది. తమిళ, తెలుగు పరిశ్రమలకు చెందిన దర్శకులు యువ దర్శకుడి నుండి ఏదైనా నేర్చుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement