Saturday, April 27, 2024

క్రిస్టియానో ​​రొనాల్డో స‌రికొత్త రికార్డు.. రికార్డ్-బ్రేకింగ్ హెడర్ గోల్‌తో సంచలన‌ విజయం

ప్రపంచ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో కొత్త రికార్డును సాధించాడు. అరబ్‌ క్లబ్‌ తరఫున మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అల్‌ నాసర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో హెడర్‌ గోల్‌ కొట్టాడు. మ్యాచ్‌ 74వ నిమిషంలో తన సహచరుడు అందించిన బంతిని రొనాల్డో హెడర్‌ గోల్‌గా మరల్చాడు. బంతి ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను దాటేస్తూ నేరుగా నెట్‌లోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో జర్మనీ దిగ్గజం గెర్డ్‌ ముల్లర్‌ పేరిట ఉన్న రికార్డును రొనాల్డో బద్దలు కొట్టాడు.

ముల్లర్‌ పేరిట ఉన్న అత్యధిక (144 హెడర్‌ గోల్స్‌)ను తాజగా రొనాల్డో (145 హెడర్‌ గోల్స్‌) అధిగ మించాడు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా కూడా రొనాల్డో అగ్ర స్థానంలో ఉన్నాడు. తాజ గోల్‌తో క్రిస్టియానో తన గోల్స్‌ల సంఖ్యను 839కి పెంచుకోవడంతో పాటు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్‌ నాసర్‌ జట్టు 4-1తో యూఎస్‌ మోనాస్టిర్‌ జట్టుపై విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement