Thursday, May 2, 2024

దేశంలో కార్లకు క్రాష్‌ టెస్ట్.. భారత్‌ ఎన్‌సీఏపీ ప్రోటోకాల్స్‌

న్యూఢిల్లిd : మన దేశంలో కార్లకు కూడా ఇక నుంచి క్రాష్‌ టెస్ట్‌ చేయనున్నారు. దీని కోసం భారత్‌ ఎన్‌సీఏపీ ( భారత్‌ న్యూ కార్‌ అసెసెమెంట్‌ ప్రొగ్రామ్‌) ని ప్రవేశపెడుతున్నారు. దీని ఆధారంగా రేటింగ్స్‌ ఇస్తారు. భద్రత పరంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు ఇది దోహదం చేస్తుందని కేంద్ర రోడ్లు, హైవే రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. క్రాష్‌ టెస్ట్‌తో రేటింగ్‌ ఇవ్వడం వల్ల వినియోగదారులు అత్యంత భద్రత ఉన్న వాహనాలనే కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందన్నారు. భద్రత పరమైన రేటింగ్‌ ఇవ్వడం వల్ల కార్ల తయారీదారుల మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందన్నారు. దీని వల్ల మన దేశం నుంచి కార్ల ఎగుమతులు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌ క్రాష్‌ టెస్ట్‌ల ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌ ఎన్‌సీఏపీ టెస్ట్‌లు ఉంటాయని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. భారత్‌ ఎన్‌సీఏపీ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం ఆమోదించింది. క్రాష్‌ టెస్ట్‌ల ఆధారంగా కార్లకు రేటింగ్‌ ఇస్తారు. దీని వల్ల వినియోగదారులు సరై, సురక్షితమైన కార్లను కొనుగోలు చేయగలుగుతారని గడ్కరీ చెప్పారు.

ప్రస్తుతం ఇలా క్రాష్‌ టెస్ట్‌ కోసం కార్లను ఇంగ్లాండ్‌కు..

పంపిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో కార్లను గంటకు 64 కిలోమీటర్ల స్పీడ్‌తో క్రాష్‌ చేసి పరీక్షిస్తున్నారు. దీని ఆధారంగా రేటింగ్‌ స్టార్స్‌ను కేటాయిస్తున్నారు. ఇలా 4 లేదా 5 స్టార్లు పొందిన వాహనాలను అత్యుత్తమ భద్రత కలిగిన వాటిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో టాటా మోటార్స్‌ , మహీంద్రా అండ్‌ మహీంద్రా తన కార్లకు క్రాష్‌ టెస్ట్‌ చేయిస్తున్నాయి. మన దేశంలో ఇక నుంచి భారత్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో గంటకు 56 కిలోమీటర్ల స్పీడ్‌తో పరీక్ష చేయనున్నారు. క్రాష్‌ టెస్ట్‌ చేసిన వాహనదారులు తమ ఉత్పత్తులకు వచ్చిన రేటింగ్‌ను ప్రచారంలో పెట్టుకోవడం ద్వారా అమ్మకాలను పెంచుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది.
భారత్‌ ఎన్‌సీఏపీ ప్రోటోకాల్స్‌, నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోముెెబైల్‌ హబ్‌గా , ప్రపంచంలోనే మన దేశం అగ్రస్థానికి చేరుకోవడానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పారు. కార్ల తయారీలో ప్రస్తుతం మన దేశం 5వ పెద్ద దేశంగా ఉంది. మన దగ్గర మాత్రం భద్రత పరమైన పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి యంత్రాంగం లేదు. అంతర్జాతీయ క్రాష్‌ టెస్ట్‌లు చేసి మనదేశంలో 5 స్టార్‌ రేటింగ్‌ పొందినవి టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్‌, పూంచ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రాకు చెందిన ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ700 కార్లు మాత్రమే ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement