Wednesday, March 29, 2023

COVID UPDATE : దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 19 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 18,738కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,78,506కు చేరాయి. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. మరో 1,34,933 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మరణించగా, 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement