Thursday, April 25, 2024

గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం.. వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. రెండు రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి, రూ.47,550గా రికార్డయింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.51,870గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి రేటు కూడా తగ్గింది. కేజీ వెండిపై రూ.600 మేర ధర తగ్గడంతో.. నేడు వెండి రేటు హైదరాబాద్‌లో రూ.63 వేలుగా ఉంది.

ఈ వారమంతా చూసుకుంటే మాత్రం 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.450 మేర పెరిగింది. నెల ప్రారంభంలో రూ.47,100 వద్దనున్న బంగారం ధర.. ఈ వారం చివరి నాటికి రూ.47,550కి ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల ధర కూడా రూ.51,380 నుంచి రూ.51,870కు పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ.490 పెరుగుదలను నమోదు చేసింది.

హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,550గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 ఎగిసి రూ.51,870గా నమోదైంది. విజయవాడలో వెండి ధర రూ.600 మేర తగ్గడంతో.. ఆ రేటు రూ.63 వేలుగా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement