Thursday, May 2, 2024

క‌రోనా కాటు – ధ‌ర‌ల పోటు

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం…
60 శాతానికి పైగా తీవ్ర ఒత్తిడిలో జనం
కోవిడ్‌ కాలం సమస్యల నుంచి ఇంకా తేరుకోని వైనం
నిత్యావసరాలపైనే సొమ్ము వ్యయం
దిగజారుతున్న జీవన ప్రమాణాలు
వ్యక్తిగత ఆదాయం, ఉద్యోగ భద్రతపై ఆందోళన
వ్యయంపై అదుపు, మదుపుపైనే దృష్టి
తగ్గిపోయిన లావాదేవీలతో పుంజుకోని వ్యాపారాలు
సాధారణ స్థితికి మరో ఏడాది శ్రీ నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ – ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – కోవిడ్‌ ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. లాక్‌డౌన్‌ నష్టాల నుంచి వ్యవస్థ కోలుకుంటోంది. త్వరలోనే తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్న ప్రచారం జరుగు తోంది. అయితే వాస్తవస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దేశంలో అన్నివర్గాలకు చెందిన 60శాతం మందికి పైగా తీవ్ర ఒత్తిళ్ళకు లోనౌతు న్నారు. ఇందుకు పలు కారణాలు న్నాయి. ఉద్యోగ భద్రత నుంచి ఆర్థిక భవితవ్యం వరకు వీరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. అయినప్పటికీ కోవిడ్‌ సమ యంలో ఎదుర్కొన్న సమస్యలు ప్రజల్ని భయం నుంచి తేరుకోనివ్వడం లేదు. వీరికి భవిష్యత్‌ పట్ల బెంగ ఏర్ప డింది. తమ వద్దనున్న ఆర్థిక నిల్వలు భవిష్యత్‌ అవసరా లకు సరిపోతాయా అన్న ఆందోళన తలకెక్కింది. దీంతో ఎవరూ నిత్యావసరాలు మినహా ఇతర పరికరాలు, సరు కుల కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదు. ఆహార పదార్థా లకు మాత్రమే ఉన్న కొద్దిపాటి నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. ఇతర అంశాల జోలికి పోవడంలేదు. ఓ వైపు ధరలు పెరుగుతున్నాయి. జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఆర్థిక పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ఉంటుందోనన్న అంచనాల్లేవు. దీంతో ఖర్చును తగ్గించుకుంటున్నారు. మదుపునకు ఎక్కువ ప్రాధాన్యతి స్తున్నారు. దేశంలో 60శాతానికి పైగా మానసిక, శారీరక ఒత్తిళ్ళకు గురౌతున్నట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. వీరికి భవిష్యత్‌ పట్ల అనిశ్చితి నెలకొంది. వ్యక్తిగత ఆదాయం, ఉద్యోగ భద్రత మానవ వనరుల వినియోగంపై ఆందోళన ఏర్పడింది. ప్రజల్లో ఎక్కువ మంది కుటుంబ సంబం ధాలు, శారీరక దృఢత్వం, పని ఒత్తిడి, పనితీరు మదింపు, సామాజిక దూరం, పిల్లల విద్య, వారి భవిష్యత్‌, శారీరక శ్రేయస్సుల పట్ల ఆందోళన ఎదుర్కొంటున్నారు. భవిష్య త్‌పై మహమ్మారి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది వీరు అంచనా వేయలేకపోతున్నారు. వీరిలో ఒత్తిడితో కూడిన భావాలు, భావోద్వేగాల్ని గుర్తించినట్లు లైబ్రేట్‌ అనే మానసిక విశ్లేషణా సంస్థ పేర్కొంది. ఇవి దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదాన్ని ఈ సంస్థ స్పష్టం చేసింది. వీరంతా మార్కెట్లను ప్రోత్సహించడం లేదు. దీంతో వ్యాపారాలు పుంజుకోవడం లేదు. ఇళ్ళ నిర్మాణం వైపు దృష్టి పెట్టడం లేదు. ఆఖరకు ప్రభుత్వం పరికరాలు, నగదు ఇస్తామన్నా ముందుకు రావడంలేదు. ఆ ఒత్తిడిని భరించలేమన్న భయం వీరిని ఆవహించింది. ఇక సొంతిళ్ళ నిర్మాణ ప్రక్రియ పూర్తిగా నిల్చిపోయింది. స్థలాలు కొనేం దుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇళ్ళుట్టేందుకు సాహసించడం లేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నా తిరిగి వాయిదాలు, అసలు చెల్లించలేమన్న భయం వీరికేర్పడింది. అలాగే ధరల పెరుగుదల ప్రభావం కూడా వీరిపై కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు.. నిత్యావసరాల కొనుగోలు మినహా మరే ఇతర అంశాలపైన రూపాయి ఖర్చు పెట్టేందుకు వీరు సాహసించలేక పోతున్నారు. ఇందుకు కారణం తిరిగి కోవిడ్‌ ఎప్పుడు పుంజుకుంటుందోనన్న భయం వీరిని ఆవహించింది. అదే జరిగితే తిరిగి లాక్‌డౌన్‌లు అమల్లొ కొస్తాయి. ఆర్థిక వ్యవస్థ మరింత నిర్వీర్యమౌతుంది. తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవోనన్న భయం వీరికి ఏర్పడింది. ఒకవేళ ఉద్యోగాలున్నా ఇప్పుడున్న జీతాలు కొవసాగుతాయన్న నమ్మకం కొరవడింది. ఇప్పటికే ఇంటి నుంచి పని పేరిట పలు రాయితీలు, ప్రోత్సాహకాల్ని కంపె నీలు తొలగించాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గతంలో కొనుగోలు చేసిన వాటి బకాయిల చెల్లింపే తలకు మించిన భారంగా ఉంది. ఈ దశలో కొత్తవి మీదేసుకునేం దుకు వీరు సాహసించలేక పోతున్నారు. దీంతో ఈ రంగాలపై ఆధారపడ్డ వారి ఉపాధి అవకాశాలు దెబ్బతి న్నాయి. సంబంధిత వ్యాపారాలన్నీ నిర్వీర్యమమ్యాయి. కోవిడ్‌ అనంతర పరిణామాల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుం టుందని అంచనా వేసినప్పటికీ అది 70శాతం కూడా పూరి ్తకాలేదు. వచ్చే ఏడాది తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొం టాయన్న అంచనాలు రూపొందుతున్నాయి. అప్పటికైనా ప్రజల్లో ఈ ఒత్తిడి, భయం తగ్గితేనే ఇది సాధ్యపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement