Saturday, April 27, 2024

చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు..

చైనాలో క‌రోనా కేసులు సంఖ్య త‌గ్గుతూ వ‌స్తున్నాయి. మొన్న‌టి దాకా ప‌ది వేల‌కు పైగా న‌మోదైన కేసులు.. శనివారం 10,815 మందికి వైరస్‌ సోకగా, నిన్న 8,838 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 2240 మందికి లక్షణాలు ఉండగా, 6598 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ సోమవారం వెల్లడించింది. వైరస్‌ వల్ల కొత్తగా ఎవరూ చనిపోలేదని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,65,312 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో రాజధాని బీజింగ్‌లో 1130 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, షాంఘైలో 131, గువాంగ్‌జౌలో 1000కి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఛాంగ్‌క్వింగ్‌లో 1845 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement