Saturday, June 22, 2024

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తున్నాం : నితిన్ గడ్కరీ బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు నోటిఫై చేసిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తూనే ఉన్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్నారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని స్టేట్ హైవేన్ ను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేశారు? ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులున్నాయి? రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి కేంద్రం వద్ద ఉన్న ప్రతిపాదనలేంట? పనులు సకాలంలో పూర్తి చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటని ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు గురువారం లోక్‌సభలో ప్రశ్నించారు.

కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఆయన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కనెక్టివిటీ అవసరాలు, నిధుల లభ్యత, ట్రాఫిక్ ఆధారంగా స్టేట్ హైవేస్ ను, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం జరుగుతుందని వివరించారు. గత మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2019 – 20లో 495 కిలోమీటర్లు, 2020-21లో 5,381,2021-22లో 2,968 కిలోమీటర్లు, 2022-23లో 3,811 కిలో మీటర్ల మేర రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేశామని నితిన్ గడ్కరీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement