హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వివిధ కోర్సుల్లో కలిపి మొత్తం 65633 ఇంజనీరింగ్ కన్వీనర్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు మరో రెండుమూడు వేలు పెరిగే అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఈనెల 29 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు 58807 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకుని ప్రాసెసింగ్ ఫీజును చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 18636 మంది ధ్రువపత్రాల పరీశీలనకు హాజరయ్యారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వచ్చేనెల 2 వరకు గడువు ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement