Saturday, May 4, 2024

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర‌!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌ట్టుతున్నార‌ని వ‌చ్చిన విశ్వ‌స‌నీయ స‌మాచారంతో అక్క‌డి పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇమ్రాన్ ఉండే ఏరియాలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయ‌డంతోపాటు ఇస్లామాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా సంస్థలు కట్టదిట్టం చేశాయి. ఇప్ప‌టికే పాక్ రాజ‌ధానిలో 144 సెక్ష‌న్ అమ‌లు చేశామ‌ని, ప్రజలు గుమికూడడాన్నినిషేధించినట్టు స్థానిక పోలీసు ఒకరు తెలిపారు.

ఇస్లామాబాద్ లోని బనిగాలాలో ఇమ్రాన్ ఖాన్ నేడు పర్యటించనున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న నేప‌త్యంలో ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భ‌ద్ర‌తను ఏర్పాటు చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు తెలిపారు.ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ కు చట్టప్రకారం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా భారత్ ను ప్రశంసించడం తెలిసిందే. త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ అయన ప్రస్తుత సర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement