Saturday, December 7, 2024

భారత్ జోడో యాత్రలో.. బస్ పైకి ఎక్కి డ్యాన్స్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

హర్యానాలో కొనసాగుతోంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. కాగా క‌ర్నాల్‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రాహుల్ యాత్ర‌లో ఎముక‌లు కొరికే చ‌లిలో ష‌ర్ట్ లేకుండా డ్యాన్స్ చేయ‌డం క‌నిపించింది. పార్టీ బ్యాన‌ర్ల‌ను చేత‌ప‌ట్టిన యువ‌జ‌న‌ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు బ‌స్‌పైకి ఎక్కి మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు క‌దిలారు. యాత్ర పొడ‌వునా రాహుల్ గాంధీ యువ‌త‌, మ‌హిళ‌లు, బీసీల‌తో పాటు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ ముందుకు సాగుతున్నారు. గిరిజ‌నుల‌తో వారి స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. ఇక రాహుల్ యాత్ర జ‌న‌వ‌రి 10న శంభు బోర్డ‌ర్ మీదుగా పంజాబ్‌లోకి ప్ర‌వేశించ‌నుంది. 11న ఫ‌తేగ‌ఢ్ సాహిబ్‌లో ప్రార్ధ‌న‌ల అనంత‌రం భారీ బ‌హిరంగస‌భ‌ను ఉద్దేశించి రాహుల్ ప్ర‌సంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement