Wednesday, May 15, 2024

చిన్నారుల‌కు మోడ్ర‌న్ హెయిర్ స్ట‌యిల్ చేసిన – ఎమ్మెల్యే సీత‌క్క‌

ప‌లువురు చిన్నారుల‌కు మోడ్ర‌న్ హెయిర్ స్ట‌యిల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఓ చిన్న కుంట వద్ద ఆగారు. స్వయంగా కత్తెర చేతబూని కొందరు చిన్నారులకు లేటెస్ట్ మోడల్ క్రాప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె స్వయంగా సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. నగరాల్లో పెద్ద పెద్ద భవంతులు ఉంటాయని, భారీ మౌలిక సదుపాయాల వ్యవస్థలు కనిపిస్తుంటాయని సీతక్క అన్నారు. చిన్న చిన్న కుంటల్లో స్నానం చేయడం, సహచరులతో కలిసి ఆడుకోవడం వంటి ఆనందాలను నగరాలు ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు. రచ్చబండకు వెళుతుండగా ఈ పిల్లలను చూడగానే పాతజ్ఞాపకాలు మనసులో మెదిలాయని సీత‌క్క చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement