Friday, May 3, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానికి 6 నెలల జైలు..

గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ అహ్మదాబాద్‌ మెట్రో పోలీసు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో నమోదైన ఓ కేసులో ఎమ్మెల్యే జిగ్నేష్‌ తోపాటు 18 మంది దళిత గ్రూప్‌ సభ్యులకు ఆరు నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. గుజరాత్‌ యూనివర్సిటీ లా భవనం పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ గా మార్చాలని డిమాండు చేస్తూ ఎమ్మెల్యే జిగ్నేష్‌ చేసిన ఆందోళనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది మే నెలలో అనుమతి లేకుండా ర్యాలీ తీశారనే కేసులో మేవానీకి గుజరాత్‌ కోర్టు గతంలో 3 నెలల జైలు శిక్ష విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement