Thursday, September 23, 2021

విజయమ్మ షర్మిలతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు: జగ్గారెడ్డి

తెలంగాణలో విజయమ్మ సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో కొడుకు జగన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, బీజేపీతో కలిసి నడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కూతురు షర్మిలతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖరరెడ్డితో తమకున్న అనుబంధం వేరని… ఇదే సమయంలో రాజకీయాలు కూడా వేరని ఆయన అన్నారు. షర్మిల తెలంగాణ కోడలేనని… ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని… అయితే, తెలంగాణకు విజయమ్మ ఏమవుతారని ప్రశ్నించారు. విజయమ్మ రాజకీయాలు ఇక్కడ నడవవని అన్నారు. తెలంగాణలో గంజాయి మత్తులో ఉన్న యువతను బీజేపీ, ఎంఐఎం మత రాజకీయాలకు వాడుకుంటున్నాయని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: బుల్ జోరు: సరికొత్త రికార్డుల్లో ముగిసిన మార్కెట్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News