Tuesday, April 30, 2024

Delhi: ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైకెర్ట‌రేట్ (ఈడీ) ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన మరికొందరు కాంగ్రెస్ నేతలతో పాటుగా సమన్లు అందుకున్న సుదర్శన్ రెడ్డి సోమవారం ఉదయం గం. 11.00కు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం గం. 4.00 వరకు విచారణ కొనసాగింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విరాళాల రూపంలో నిధులు సమకూర్చిన నేతలను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మాజీ మంత్రి గీతా రెడ్డి, అనిల్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను ఈడీ ప్రశ్నించింది. తాజాగా సుదర్శన్ రెడ్డిని ఇదే అంశంపై ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement