Friday, April 19, 2024

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఆస్తులు, అప్పులు.. ఈసీకి ఇచ్చిన‌ లెక్క‌లివే!

మునుగోడు ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న నామినేష‌న్‌లో భాగంగా ఆయ‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్ర‌కారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది. కాగా, కోమ‌టిరెడ్డి త‌న‌కు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. కోమ‌టిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా… చ‌రాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయ‌న‌ పేర్కొన్నారు. త‌న స‌తీమ‌ణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లు ఉన్న‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement