Sunday, May 5, 2024

తోషం తండాలో క్షుద్రపూజల కలకలం.. గుప్త నిధుల కోసం మహిళ బలి

గుడిహత్నూర్‌, ప్రభన్యూస్‌: కొందరి అత్యాశ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. అత్యాధునిక సైన్స్‌ యుగంలో కూడ గుప్త నిధులు ఉన్నాయా.. క్షుద్ర పూజలు మూఢనమ్మకాల నెపంతో బలి అవుతున్న ఎందరో అమాయకులు. తాజాగా ఓ సంఘన గుడిహత్నూర్‌ మండలం తోషం తండా గ్రామంలో సంచలనం రేపుతోంది. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేసి ఓ మహిళనే బలి ఇచ్చిన ఘటన కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే గత వారం రోజుల క్రితం ఆగస్టు 1న తోషం తండా గ్రామానికి చెందిన కవిత అనే మహిళను (46) గుప్త నిధులు ఉన్నాయని మభ్య పెట్టి అదే గ్రామానికి చెందిన కొందరు క్షుద్రపూజల నిమిత్తమ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి బలి ఇచ్చారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 2వ తేదీన గ్రామ సమీపంలని వ్యవసాయ బావిల ఆమహిళ శవమై తేలింది. గ్రామస్థులు , ఊరి పెద్దల సమక్షంలో గుట్టుచప్పుడు కాకుండా మహిళ శవం దహనం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొదటగా పోలీసులకు సమాచారం అందించాల్సిన ఆగ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు ఈవిషయాన్ని గోప్యంగా ఉంచారన్న విషయం కాస్త ఆనోట ఈనోట బయటకు పొక్కడంతో కుటుంబ సభ్యులు స్థానిక పలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు చనిపోయిన మహిళ కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తోందని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.

ఆమహిళను కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంచేస్తున్నారా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే గుప్తనిధుల కోసమే మహిళను హత్య‌ చేసి వ్యవసాయ బావిలో పడేసినట్లుగా తెలుస్తోంది. క్షుద్రపూజలు చేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు కూడ ఆబావిలో తేలియాడుతూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు భావిస్తుండగా మహిళను హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను ఇంకొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి మహిళను హత్య చేసి ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకతరించే ప్రయత్నం చేస్తున్నారా అన్నారు.

గ్రామస్థులు ఊరిపెద్దలు ఈవిషయాన్ని గత వారంరోజులుగా గోప్యంగా ఉంచి పోలీసులకు ప్రాథమిక సమాచారం ఇవ్వకుండా లోలోపలే మహిళ శవాన్ని ఎందుకు దహనం చేశారు. అంతా అయ్యాక ఇప్పుడు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంలో ఆంతర్యం ఏంటని గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేయించిందెవరు అసలు ఈఘటనకు ప్రధాన సూత్రదారి ఎవరుఅని సినిఫక్కీలో జరిగిన ఈఘటన వెనుక ఎవరి హస్తం ఉందో ఇలా ఒకటా రెండా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement