Friday, May 3, 2024

Confident – హ్యాట్రిక్..గ్యారెంటీ ! మళ్లీ అధికారం మాదే – న‌రేంద్ర‌ మోదీ

కేంద్ర ప్రభుత్వం చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంట్ భవనంలో మొదటి సమావేశంలో ఈసారి ఆర్థిక మంత్రి దిశా నిర్దేశక్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని ప్రధాని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో దేశం దినదినాభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ధృఢంగా విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశడతామని అన్నారు. ఈ సందర్భంగా మోదీ మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తన మాటల్లో ధీమాను వ్యక్తం చేశారు. చివరి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గడిచిన పదేళ్లలో తాము ఎలా వ్యవహరించారో పునరాలోచించుకోవాలి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు తమ ఉత్తమ ప్రతిబకనబర్చాలని మోదీ సూచించారు. మా ప్రభుత్వానికి జనాదరణ ఉంది.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ వస్తుంది.. దేశం వృద్ధిలో ముందుకు వెళ్తుందని మోదీ అన్నారు.

ఆ వైఖ‌రి మార్చుకోవాలి.. ప‌శ్చాత్తాప‌ప‌డండి..
ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా పశ్చాత్తాపడండి, వారి వైఖరి మార్చుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేవారిని ప్రజలు క్షమించరని అన్నారు.శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారింది. నారీశక్తిని కేంద్రం ప్రతిభింబిస్తుంది. కొత్తపార్లమెంట్ భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో నారీశక్తి వందన్ అధినియమ్ పేరుతో మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపాం. జనవరి 26న కర్తవ్య పథ్ లో నారీశక్తి ఇనుమడించింది. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్గదరక్శకత్వంలో మొదలు కానున్నాయి. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మన నారీ శక్తికి ప్రతీక ఇదే అని మోదీ అన్నారు. చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని మోదీ ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement