Tuesday, May 14, 2024

Concept Song – ప‌వ‌న్ – తేజ్ ‘బ్రో’ థీమ్ సాంగ్ వ‌చ్చేసింది..

YouTube video

పవన్ కల్యాణ్ – సాయితేజ్ హీరోలుగా ‘బ్రో’ సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సముద్రఖని దర్శ కుడు. తమిళంలో వచ్చిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – సంభాషణలు సమకూర్చడం విశేషం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి, థీమ్ ఆఫ్ ‘బ్రో’ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్ కి తగినట్టుగా, పవన్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాట సాగింది.


తమన్ బాణీలను సమకూర్చిన ఈ పాటకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. ‘బ్రో’ టైటిల్ ను లింక్ చేస్తూ పాటను రాసిన తీరు బాగుంది. తమన్ స్వరపరిచిన బీట్ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ సాంగ్ ను వినండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement