Sunday, May 5, 2024

కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.44.50లు తగ్గింపు

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ వినియోగదారులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ (Commercial cylinder) ధరను రూ.36 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో రూ.2012.50గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1976కు చేరింది. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. హైదరాబాద్‌లో రూ.44.50లు తగ్గింది. దీంతో రూ.2242గా 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2197.50కి తగ్గింది. కోల్‌కతాలో రూ.2095.50, ముంబైలో రూ.1936.50, చెన్నైలో రూ.2141గా సిలిండర్‌ ధర ఉన్నది. కాగా, గత నెల 6న వాణిజ్య సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.8.50 తగ్గించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement